హైదరాబాదులో ఘనంగా సీఎం రమేశ్ తనయుడి వివాహం.. పలువురు ప్రముఖుల హాజరు

  • శ్రీపూజతో సీఎం రమేశ్ తనయుడు రిత్విక్ పెళ్లి
  • హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో వివాహ మహోత్సవం
  • పలువురు సినీ ప్రముఖుల హాజరు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనయుడు రిత్విక్ వివాహం శ్రీపూజతో ఘనంగా జరిగింది. శ్రీపూజ ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె. రిత్విక్, శ్రీపూజల వివాహానికి హైదరాబాదు మాదాపూర్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. ఈ పెళ్లికి సీఎం రమేశ్ అనేకమంది ప్రముఖులను ఆహ్వానించారు.

నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, మోహన్ బాబు కూడా విచ్చేశారు. ఈ పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రానున్నారు. ఏపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. సీపీఐ నారాయణ, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ కూడా పెళ్లిలో కనిపించారు.
Go Back to Shorts
CM Ramesh
Rithwik
Sripuja
Wedding
Hyderabad

More Telugu News